గురువులను ఎప్పటికీ మర్చిపోను వద్దు
- వైద్య విద్య సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి
హైదరాబాద్(ఆరోగ్యజ్యోతి): యూజీసీ కి పిఆర్సి కి త్వరలో జీవో వస్తుందని వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి అన్నారు. టీచర్స్ డే సందర్భంగా మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ జేఏసీ .( TMPH JAC) ఆధ్వర్యంలో వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ రమేష్ రెడ్డి శనివారం నాడు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య విద్యార్థులు అందరూ చక్కగా చదువుకొని భవిష్యత్తులో గొప్ప డాక్టర్లు ప్రజాసేవ చేస్తూ మంచి పే తెచ్చుకోవాలని అన్నారు . పి జి చేయడానికి ఇన్ సర్వీస్ డాక్టర్లకు ,నాన్ సర్వీస్ డాక్టర్లకు అందరికీ కూడా సమాన అవకాశాలు ఉండేలా చూస్తామని అన్నారు. వైద్య విధాన పరిషత్ లో ఉన్న సమస్యలు కూడా త్వరలో పరిష్కారం అవుతాయనిఈ సందర్భంగా అయన తెలిపినారు. ప్రభుత్వం కూడా భయానకమైన కోవిద్ వాతావరణం లో పనిచేస్తున్న వైద్యులు ,వైద్యసిబ్బంది సమస్యల పరిష్కారం పట్ల సానుకూల ధోరణి తో ఉందని అన్నారు. గురువులను ఎప్పటికీ మర్చిపోను వద్దని తెలిపినారు. ప్రతి విద్యకి ఒక గురువు ఉంటారన్నారు. అమ్మ నాన్న తర్వాత గురువేనని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో డాక్టర్ రవి శంకర్, చైర్మన్, కర్నాటి సాయిరెడ్డి, కన్వీనర్, డాక్టర్ కత్తి జనార్దన్, వర్కింగ్ కమిటీ చైర్మన్, డాక్టర్ MD షెరీఫ్, కో చైర్మన్, డాక్టర్ అభిరాం, కో కన్వీనర్, డాక్టర్ ప్రవీణ్, కో కన్వీనర్, వరప్రసాద్, 108 యూనియన్ సబ్యులు తదితరులు పాల్గొన్నారు