- జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్
తాంసీ,ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేంద్ర అన్నారు. శనివారం నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల బందాల్ నాగపూర్ గ్రామంలోని పాఠశాలలో కోవిడ్ పరీక్ష శిభిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానం ఉన్న ప్రతి ఒక్కరు పరిక్షలు చేసుకోవటానికి ముందుకు రావాలన్నారు. ఒక ఇంటిలో కరోన వచ్చిందంటే ఇంటిలో ఉన్న వారందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఎలాంటి భయ పడవలసిన అవసరం , డాక్టర్లు సూచించిన మేరకు మందులు, సరైన ఆహారం టైంకి తీసుకుంటే చాలు అన్నారు. ప్రారంభంలో వైరస్ వచ్చినపుడు వైరస్ అంటే భయం ఉండేదని ప్రస్తుతం 80 శాతం వరకు కరోన(కోవిడ్-19) కి శక్తి నశించి పోయింది అని అందుకు ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. వైరస్ వచ్చిందని భయాందోళనలకు గురికావద్దని చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మీ వైద్య అధికారిని సంప్రదించి చికిత్సలు చేయించుకోవాలన్నారు అత్యవసర పరిస్థితి ఉంటే రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి రాజు జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్. ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆయుస్ వైద్య ఆదికి డాక్టర్ కృష్ణవేణి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.