వైద్య ఉద్యోగుల సమస్యలు అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలి

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి) : వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో చర్చించి పరిష్కరించాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు భూపాల్, వైస్ ప్రెసిడెంట్ బలరాం ,సెక్రెటరీ యాద నాయక్ ,ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయాలన్నారు. ఆరు నెలలుగా కరోన  మహమ్మారి వల్ల 17 మంది వైద్య సిబ్బంది చనిపోయారని రెండు వేల మందికి పైగా సిబ్బంది కరోనా బారిన పడ్డారని వారికి వెంటనే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 50 లక్షలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా యాభై లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెల్లించాలని వారు డిమాండ్ చేశారు