పారిశుద్యంపై గ్రామాల్లో అవగాహన కల్పించండి

- జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్
ఇంద్రవెల్లి ,ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): గ్రామాల్లో ప్రతీ వారం క్రమం తప్పకుండా పారిసుద్యంపై పనులు చేయించ వలసిన బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ శ్రీధర్ అన్నారు. శని వారం నాడు పిట్టబొంగారం  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు .ముందు రికార్డులను పరిశీలించిన అనంతరం సిబ్బందితో సమావేశం నిర్వహించారు. కోవిడ్ ల్యాబ్ ను పరిసిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇమ్యునైజేషన్ క్రమం తప్పకుండా చేయించాలని సూచించారు .గర్భవతులను  నమోదు చేయలని దీనిద్వారా వారికి ప్రభుత్వం ఇచ్చే సహకారంతో పాటు కేసీఆర్ కిట్  కూడా ఉచితంగా అందుతుందని ఈ సందర్భంగా సిబ్బందికి ఆయన తెలియజేశారు. పారిశుద్ధ్యం చేయించడం వల్ల మలేరియా డెంగ్యూ అతిసార వంటి వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని  సిబ్బంది తెలిపారు.వర్షాకాలం కావడం వల్ల పూర్తి జాగ్రత్తలు వహించాలని గ్రామాల్లో ప్రతి ఒక్కరికి పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్ హరీష్, ఫార్మసిస్ట్  సాయి కృష్ణ,  ఎల్ టి సూర్యకళ, SN సూర్యకళ, తదితరులు పాల్గొన్నారు.