- జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): కోవిడ్-19పై పై ప్రజలకు అవగాహన కల్పించడంలో వైద్యులు వైద్య సిబ్బంది ముందు ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ వైద్య అధికారులకు సూచించారు. కరోన లక్షణాలు వచ్చిన వారికి ఏ విధంగా ఉంటాయో, ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలని అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తన చాంబర్ లో వైద్య అధికారులకు శుక్రవారంనాడు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన లక్షణాలను ప్రజలకు తెలిపి అవగాహనా కల్పించాలని పేర్కొన్నారు.కరోన వ్యాధి సంభవించ కుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని బయటకు వెళ్తే ఎలాంటి పరిణామాలు వస్తాయో తెలపలన్నారు.బయటకు వెళ్లే అవసరం అయినట్లైతే తప్పకుండా మాస్క్ ధరించి ,సామాజిక దూరాన్ని పాటించాలని సుచినచారు.కరోన లక్షణాలు కనిపించిన వెంటనే ప్రజలు సంబంధిత ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని, లేనిపక్షంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కానీ, లేదంటే దగ్గరలోని ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి వారికీ తెలపలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలల్లో, గ్రామా గ్రామాల్లో కరోనా కు సంబంధించిన వైద్య పరిక్షలు ఉచితంగా చేస్తున్నారని తెలిపారు. కరోన వచినట్లయితే వైద్యులు సూచించిన సూచనలు తప్పకుండా పాటించి సమయానికి మందులు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్. ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్ , జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయ సారథి. ఎం సి హెచ్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నవ్య సుధా, ఎన్ సి డి ప్రోగ్రాం అధికారి ఇ డాక్టర్ క్రాంతి,ప్రాథమిక ఆరోగ్య కేంద్ర లకు చెందిన వైద్య అధికారులు, ఆయుస్ వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.