వ్యాధులపై సమీక్ష సమావేశం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి); ముందస్తు వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఇన్చార్జ్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సాధన ఆధ్వర్యంలో శనివారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చాంబర్లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వ్యాధులు దరిచేరవని అన్నారు. డెంగ్యూ మలేరియా తో పాటు కీటక జనిత వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. అనంతరం జిల్లా మలేరియా నివారణ అధికారి డాక్టర్ ఎం శ్రీధర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులతో పాటు మలేరియా వ్యాధి రాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు . పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నట్లయితే వ్యాధులు దరిచేరవు అన్నారు ఈ కార్యక్రమంలో   ఆదిలాబాద్ మున్సిపాలిటీ  అసిస్టెంట్ కమిషనర్ సి వి ఎన్  రాజు. అంకోలి వైద్యాదికారి డాక్టర్ రోజా రాణి , NVBDCP జిల్లా కర్దినేటర్ సభనాజ్ రఘునాథ్, గోకుల్ , సుబునిత్ పట్టణ ఆరోగ్య కేంద్రానికి చెందిన కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు