- లెప్రసీ సంయుక్త సంచాలకులు డాక్టర్ జాన్ బాబు
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ పట్టణంలోని కుష్టి వ్యాధి గ్రస్తుల కాలనీలో నివాసముంటున్న రోగులకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని లెప్రసీ నివారణ విభాగం రాష్ట్ర సంయుక్త సంచాలకులు డాక్టర్ జాన్ బాబు అన్నారు .గురువారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన కుష్టువ్యాధి గ్రస్తులకు కాలనీలో కలిసి సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు కుష్టి వ్యాధి గ్రస్తులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇబ్బందులు ఉంటే నివారణ అధికారి సంప్రదించాలని సూచించారు. వారానికి ఒకసారి తప్పనిసరిగా కాలనీ సందర్శించి అవసరం ఉన్నవారికి మందులు అందించాలని వైద్య సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు. ప్రహరీ నిర్మాణం తో పాటు మిగతా సౌకర్యాలను కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తామన్నారు. అనంతరం కుష్టు రోగులకు గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ఎన్ సి డి జిల్లా అధికారి డాక్టర్ క్రాంతి, డిప్యూటీ పార మెడికల్ అధికారి వామంరావ్, రమణాచారి తదితరులు పాల్గొన్నారు