పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరవు

వరంగల్ అర్బన్(ఆరోగ్యజ్యోతి) : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచినట్లయితే వ్యాధులు దరిచేరవని పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ఎస్ రవీందర్ అన్నారు. మంగళవారంనాడు చింతల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల చింతల్ చంద్ర వాదన కాలనీ లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోన  వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరు విధిగా మార్పు ధరించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి అరగంటకు ఒకసారిసబ్బుతో గాని శానిటైజర్ తో గాని చేతులను శుభ్రం చేసుకోవాలని తెలిపారు. ఈ క్యాంపు లో 61 రోగులకు వైద్య పరిక్షలు చేసి మందులు పంపిణి చేసారు.ఈ ఉచిత వైద్య శిబిరం లో చింతల్ యూపీఎచ్ సి మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , సిఓ దేవాసాని మోహన్ రావు , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ఆశ వర్కర్ అనూష , తదితరులు పాల్గొన్నారు.