వైద్యుల పై అధికారుల దౌర్జన్యం ఆపాలి

టి ఎన్ పి హెచ్ జెఏ సి –డిమాండ్


హైదరాబాద్( ఆరోగ్యజ్యోతి) ; డాక్టర్లపై ఉన్నత అధికారుల దౌర్జన్యం ఆపాలని లేనిపక్షంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ యాక్షన్ కమిటీ చైర్మన్ డాక్టర్ రవి శంకర్, కన్వీనర్ కర్నాటి  సాయి రెడ్డి వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్, కోశాధికారి డాక్టర్ శ్రీ కృష్ణ రావు ,ఎండి షరీఫ్ ,కో- చైర్మన్లు రమేష్ అభిరామ్, కన్వీనర్ డాక్టర్ ప్రవీణ్ ,సుదర్శన్, సుజాత, ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట లో జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్  సోమ నాయక్ అనే వైద్య అధికారినిపై ఇతన్ని లాగి పడేయండి, అరెస్ట్ చేయండి అనడం విద్దురంగా ఉందన్నారు. దీనిని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ తీవ్రంగా ఖండించింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఒక వైద్యాధికారి పట్టుకొని లాగేయండి అరెస్ట్ చేయండి అనడం ఎంతవరకు సమంజసనియమాని  అని వారు అన్నారు డాక్టర్లకు అందరిలాగే మానవ హక్కులు ఉన్నాయని సమస్యలు లేవని అయితే అధికారుల పట్ల సానుకూలంగా స్పందించిన కలెక్టర్ ఈ విధంగా చేయడం ఏమిటని వారు ప్రశ్నిచారు. సొమ్ములు నాయక్ ఎంతో గౌరవమైన వ్యక్తి అని గతంలో ఆయన కాయకల్ప అవార్డు కూడా తీసుకున్నారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. వైద్య అధికారిని అవమానించడం తో పాటు ఐదు గంటలపాటు పోలీస్స్టేషన్లో నిర్బంధించడం సిగ్గుచేటని తెలిపారు . భయంకరమైన కరోన  పరిస్థితిలో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది అండగా ఉండాల్సింది పోయి,  నైతిక  విలువలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం వల్ల వైద్య ఆరోగ్య శాఖ పూర్తి నిర్లక్ష్యానికి గురి చేస్తుందన్నారు. ఒకవేళ అవమానానికి గురైన మనస్థాపంతో ఏదైనా పాల్పడితేఎవరు భాద్యులని   ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు .ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే విషయంలో జోక్యం చేసుకొని ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు