వైద్య సిబ్బంది, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా
సమస్యను పరిష్కరిస్తము – డి ఎం ఎహ్ ఓ
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిపై వైద్యాధికారి సూపర్ వైజార్ మాటలు దురుసుగా ప్రవర్తిస్తున్నారని రెండేళ్లుగా తను అంటున్న మాటలు అనుభవిస్తూ వస్తున్నామని ఓపిక నశించడం వల్ల రెండు రోజుల క్రితం జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నరేందర్ కు వినతిపత్రం సమర్పించామని, గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సోమవారం గిరిజన సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది మాట్లాడుతూ తను కంటి వెలుగు కరోన, సీజనల్ వ్యాధులు ఇమ్యునైజేషన్ తో పాటు అన్ని రకాల మాతాశిశు సంరక్షణ కార్యక్రమాలతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో నిర్వహిస్తున్న అన్ని కార్యక్రమాలు సక్రమంగా చేయడం వల్లనే డాక్టర్ శ్రీనివాస్ కు ఉత్తమ వైద్యుడు గా అవార్డు అందుకున్నారు. అని తమ వల్లనే అవార్డు అందుకొని ప్రాథమిక ఆరోగ్యానికి గుర్తింపు తెచ్చానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. సిబ్బంది వేధింపులకు గురి చేస్తున్న వైద్య అధికారిని సూపర్వైజర్ ని వెంటనే విధుల నుంచి తప్పించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఒకవేళ బదిలీ చేసినట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో పనిచేస్తున్న సిబ్బంది అందరిని బదిలీ చేయాలని వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు.ఈ సందర్భంగా తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గెడం గణేష్, ప్రధాన కార్యదర్శి బాబురావు, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్ప రాణి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగు పటేల్ తో పాటు ఇతర నాయకులు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యాధికారి సూపర్వైజర్ లను వెంటనే బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. మహిళలపై వేధింపులు ఆపాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుష్ప రాణి పేర్కొన్నారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో రోజు రోజుకు వేదింపులు ఎక్కువ అవ్తున్నాయని తెలిపినారు. మహిళా ఉద్దోగులపై వేదింపులు అపనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, ప్రధాన కార్యదర్శి సిడం వామన్ మాట్లాడుతూ విచారణ పూర్తయ్యేంతవరకు వైద్య అధికారిని, సూపర్వైజర్ విధుల నుంచి తప్పించాలని వారు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
విచారణ చేపడతాం - తప్పు చేసిన వారిని వదిలిపెట్టను
కలెక్టర్ దృష్టికి తీసుకెల్లి నాము
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్
తప్పు చేసిన ఎ ఉద్యోగిని కూడా వదిలే ప్రసక్తే లేదని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు .వైద్యాధికారి సూపర్వైజర్ తప్పు చేశారని శనివారం నాడు గుడిహత్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఉద్యోగులు వినతిపత్రం ఇచ్చారని వాటిపై విచారణ చేపడతామని తెలిపారు. సోమవారం నాడు విచారణ సాగిస్తామని చెప్పినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే వైద్యాధికారి సూపర్వైజర్ కూడా వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కరించే విదంగా కృషి చేస్తానని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తెలిపారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లాలని కలెక్టర్ విచారణ చేపడతాం అని ఈ సందర్భంగా తెలిపినట్లు ఆయన పేరు తెలిపారు . విచారణ అధికారిగా మహిళా సంక్షేమ శాఖ అధికారి నియమించినట్లు కలెక్టర్ పేర్కొన్నట్లు వైద్య ఉద్యోగులకు సంఘాల నాయకులకు తెలిపారు.