- ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్
తలమడుగు ,ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి) : కరోనా పై అనుమానం ఉన్న లక్షణాలు కనిపించిన వారు నిర్భయంగా వచ్చి కరోన పరీక్షలు చేయించుకోవాలని ఇన్చార్జ్ అడిషనల్ డి ఎం అండ్ హెచ్ వో జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం నాడు తలమడుగులోని రుయ్యడి గ్రామంలో నిర్వహిస్తున్న కరోన టెస్టుల శిభిరాన్ని అయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా అనుమానితుడు అందరూ ప్రభుత్వ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు . ఈ గ్రామంలో కరోన పాసిటివ్ కేసులు రావడం వల్ల శిభిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తలనొప్పి జ్వరం ఒళ్ళు నొప్పులు లాంటివి ఉన్నట్లయితే శిబిరానికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన అనంతరం కరుణ లక్షణాలు కనిపించినట్లయితే వెంటనే కరోనా టెస్ట్ చేస్తారని తెలిపారు ఉన్నట్లు నిర్ధారణ అయితే 14 నుంచి 17 రోజులపాటు సొల్యూషన్ లో ఉండాలన్నారు వైద్యులు సూచించిన మేరకు క్రమం తప్పకుండా అన్నారు. ప్రజలు కూడా అత్యవసర సమయంలో మాత్రమే బయటకు వెళ్లాలని ఏ పని లేకుండా ఇంటి నుంచి బయటకు రావద్దు అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జీ.రావుల్ తదితరులు పాల్గొన్నారు.