ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్( రిమ్స్) ఆస్పత్రిలోని మలేరియా లేబరేటరీ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మెట్పల్లి శ్రీధర్ మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. మలేరియా వ్యాధి గ్రస్తులకు అందుతున్న వైద్యసేవలు ఏ విధంగా చేస్తున్నార అని ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణ అని అడిగి తెలుసుకున్నారు .సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండి అందరికీ సరైన రీతిలో పరీక్షలు చేయాలని సూచించారు.రోగులపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి సేవలు అందించడంలో ముందుండాలని తెలిపారు. ఏదైనా ఇబ్బందులు తన దృష్టికి తీసుకురావాలని వెంటనే వాటిని పరిష్కరించే చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ల్యాబ్ టెక్నీషియన్ బండారి కృష్ణ ఎన్ టి ఎస్ అనిల్ తదితరులు ఉన్నారు.