వరంగల్(ఆరోగ్యజ్యోతి): చింతల్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం నాడు పుప్పల గుట్ట (కుంట) ఏరియాలో ఎసిఎమ్ స్ప్రే చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిధిగా వరంగల్ సిటీ సబ యూనిట్ ఆఫీసర్ సిరీమాళ్ల లింగమూర్తి ,అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. సుమారు 64 ఇళ్ళలో ఈ సర్వే చేయడం జరిగింది, మందులు పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం, మురికి నీరు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.కరోన వ్యాధి సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని,ప్రతి అరగంటకు ఒకసారి సబ్బుతో చేతులు కడుక్కొని ఇవ్వాలని సూచించారు. బయటికి వెళ్ళినట్లయితే సామాజిక దూరాన్ని పాటించాలన్నారు .ఈ కార్యక్రమంలో మలేరియా సూపర్వైజర్ తేజావత్ రవీందర్ , మెడికల్ ఆఫీస్ అసిస్టెంట్ రాజేష్ కన్నా హెల్త్ సూపర్వైజర్ వెంకన్న జిలకర శ్రీలత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.