మెదక్,(ఆరోగ్యజ్యోతి): ఇటీవల మరణించిన ఈ సి ఏ ఎన్ఎం రేణుకా కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ వైద్య ఉద్యోగుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు భరత్ సత్యనారాయణ డిమాండ్ చేశారు. సోమవారం నాడుజిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమలో వైద్య ఉద్యోగులు ఈ సి రేణుకకు వైద్యులు నర్సులు ఇతర సిబ్బంది శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా భారత్ సత్యనారాయణ మాట్లాడుతూ మరణించిన వారికి కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 50 లక్షలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని మరో 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని దీనితోపాటు మంత్రుల కూడా 25 లక్షల రూపాయలు కుటుంబానికి చెల్లించి ఆదుకోవాలన్నారు .కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చందర్ నాయక్ ,ప్రతాప్ గౌడ్ ,ముంతాజ్ అలీ, బస్వరాజ్, కార్యదర్శి ఉమాకాంత్ ,కమల ఫార్మసిస్ట్ , కమల ఎల్ టి , విష్ణు ,తదితరులు పాల్గొన్నారు.