మహిళాచే దేశం అన్ని రంగాల్లో అబివృధ్ది

- ఆర్యవైశ్య అధ్యక్షులు సింగిరికొండ మాధవశంకర్


వరంగల్(ఆరోగ్యజ్యోతి):  ఛాయా సోషల్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో గర్ల్స్ అడ్వొకేసీ అల్లైయాన్స్ వారి సహకారం తో మహిళలకు వృత్తి నైపుణ్య శిక్షణ అవకాశాలను పెంపొందించి వారి ఆర్థిక సాధిరకతకు తోడ్పడాలని సంతకాల సేకరణ కార్యక్రమాన్ని  సోమవారం నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆర్యవైశ్య అధ్యక్షులు సింగిరికొండ మాధవశంకర్ మాట్లాడుతూ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఛాయా సవచ్చంద సంస్థ (GAA) సభ్యులు అభినంద నీయలు తెలిపినారు. మహిళలకు ఉపాధి శిక్షణ అవకాశాలను కల్పించి శిక్షణాకేంద్రాలను ఏర్పరచి మహిళల ఆర్థిక సాధికారతకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలనీ పిలుపునిచ్చినారు. ఆర్థిక సాధికారత సాదించడము ద్వారా మహిళలు సమాన అవకాశాలు పొందుతారని అన్ని విదాలుగా అభివృద్ధి లో ముందుంటారని మహిళలు ఏ పనినయినా క్రమశిక్షణతో పట్టుదలతో నిజాయితీ తో నిర్వహిస్తారని  ఈ సందర్భంగా అయన తెలిపినారు.మహిళా అబివ్రుదే కుటుంబానికి , సమాజానికి దేశానికి వన్నె తెస్తాయని కొనియాడినారు కాబట్టి మహిళలకు సంబందించిన వృత్తి నాయిపుణ్య శిక్షణ కేంద్రాలను మరింతగా అభివృద్ధిపరుచుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలనీ అన్నారుఈ కార్యక్రమంలో ఛాయా సంస్థ కార్య దర్శి కోట డేవిడ్ , తాబేటి శ్రీనివాస్ గౌడ్ , మైసి శోభన్ బాబు , సుదర్శన్ , రాజు , యువరాజు , లక్ష్మి నారాయణ , నల్ల భారతి స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు యువజనసంఘల నాయకులు మహిళా సంఘలు సభ్యులు అరుణ , జ్యోతి ,పద్మా , తదితరులు పాల్గొన్నారు.