చేస్తున్న స్టాప్ నర్సులకు 7 నెలల వేతనాలు చెల్లించండి

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ ఆస్పత్రిలో పని చేస్తున్న స్టాప్ నర్సులకు గత 7 నెలల నుండి వేతనాలు ఇవ్వకుండా హార్థికంగా మానసికంగా స్టాప్ నర్సులను అధికారులు ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తుందని  ముందు AITUC తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ & ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సిర్ర దేవేందర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం ఆధ్వర్యంలో నిరసన ధర్నా చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నో గొప్పలు చెప్పుతుందని,  మాది బంగారు తెలంగాణ ప్రజలు ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నారని చెపుతూన్నారని అయన పేర్కొన్నారు,ప్రభుత్వం మాత్రం స్టాప్ నర్స్ కార్మికులను పట్టించుకోవడం లేదన్నారు. ఇదేం బంగారు తెలంగాణ అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి ఇబ్బంది కలగద్దన్న ఆలోచనతో స్టాప్ నర్సులు ప్రాణాలను కుటుంబాలను లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు. డైరెక్టర్ ను వేతనాలు ఎప్పుడిస్తారు సారూ అని ఆడిగినప్పుడల్లా నాకేం తెలుసమ్మ నేను పై అధికాలతో మాట్లాడుతాను మాట్లాడి చెపుతాను అని చెపుతున్నరే తప్ప వేతనాలు ఎప్పించడం లేదన్నారు.మీరు కాంట్రాక్ట్ వర్కర్స్ మీరు ఎక్కువ మాట్లాడితే మిమ్ములను తీసేస్తాం అంటూ రిమ్స్ డైరెక్టర్ బెదిరిస్తూ మానసికంగా స్టాప్ నర్సులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి JC సంధ్యారాణి గారికి మెమోరాండం ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాప్ నర్సులు N కమళ విశాల సునీత  వసంత సురేఖ తదితరులు పాల్గొన్నారు