జిల్లాలో కోవిడ్ టీం పర్యటన

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి):  జిల్లాలో స్టేట్ కోవిడ్ టీం గురువారంనాడు పర్యటించింది. జిల్లాలోని గుడిహత్నూర్, బేలా, గిమ్మ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ పరిస్థితిపై స్టేట్ కోవిడ్ టీం ఇంచార్జ్ లెప్రసీ సంయుక్త సంచాలకులు డాక్టర్ జాన్ బాబు బృందం పరిశీలించింది. కోవేట్ టెస్ట్ లో ఏ విధంగా చేస్తున్నారు . కోవిడ్ పై  ప్రచారం ఏ విధంగా ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ పరీక్షలు పనితీరుపై పరిశీలించారు. కోవిడ్ సోకిన వారిపై ఎలాంటి శ్రద్ధ వహిస్తున్నారు అన్నదానిపై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరిశీలించారు.కోవిడ్ వ్యాధిపై పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ప్రజలు భయపడవలసిన అవసరం లేదన్నారు. పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వ్యాధి తగ్గుతుందన్నారు. వైరస్ సోకిన వ్యక్తి 14 నుంచి 17 రోజులపాటు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు వైద్యుల సలహాలు సూచనలు క్రమం తప్పకుండా పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా లెప్రసీ మరియు ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శ్రీకాంత్ ఎన్ సి డి జిల్లా అధికారి డాక్టర్ క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.