హైదరాబాద్, (ఆరోగ్యజ్యోతి): 104 సర్వీస్ లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 143 సంఘం ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణకు మంగళవారంనాడు వినతిపత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం సమర్పణ కార్యక్రమం లో తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు భూపాల్, ప్రధాన కార్యదర్శి యాద నాయక్, కార్యదర్శి విజయవర్ధన్ రాజులు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 104 సిబ్బంది ఉమ్మడి జిల్లాల వారీగా ఉద్యోగులను స్థానిక ఆధారంగా భాదిలి చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 198 వాహనాలు ఉన్నాయన్నారు. 28 వాహనాల ద్వారా పని చేయవలసి వస్తుందని దీనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల్లో మందుల సరఫరా కూడా సక్రమంగా లేదని ,కమ్యూనికేషన్ డిసీజెస్ సంబంధించిన బిపి, షుగర్, ఆస్తమా వ్యాధి మందులు సప్లై లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. 104 వాహనం డాక్టర్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ ,హెల్త్ సూపర్వైజ,ర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితరులు ఉండాలి కానీ ముగ్గురు మాత్రమే ఫీల్డ్ లో ఉంటున్నారని సిబ్బంది కొరత కారణంగా వాహనంలో సిబ్బంది లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. బడ్జెట్లో 15 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని తెలిపినారు. సిబ్బంది వేతనాలుకూడా నెలనెలా రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, నెలనెలా వేతనం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.