104’ను పటిష్ఠపర్చండి: హైకోర్టు

హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) : 104 హెల్ప్‌లైన్‌ సేవలను పటిష్ఠం చేయాలని హైకోర్టు వైద్య, ఆరోగ్యశాఖకు ఆదేశాలు జారీచేసింది. కరోనా బాధితులకు 104 నంబర్‌ అందుబాటులో ఉండటం లే దని.. ఉస్మానియా, గాంధీతోపాటు అన్ని కార్పొరేట్‌ దవాఖానల్లో కరోనా పరీక్షలు జరిగేలా చూడాలని కోరుతూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఈ అంశాలపై ప్రభుత్వం కౌంటర్లు దాఖలుచేయాలని, ఈనెల 24న విచారణ చేపడుతామని తెలిపింది.