కరోన టెస్టు నిర్వహణ నుంచి ఏఎన్ఎంలు తప్పించాలి

 


- డి ఎమ్ హెచ్ ఓ కార్యాలయం ఎదుట అర్బన్ పిఎహ్ సి  ఏఎన్ఎం ల నిరసన


ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):  ప్రభుత్వం ఫిల్డ్ స్టాఫ్ ఎఎన్ఎంలను కోవిడ్ పరీక్ష లు  చేయించాలనే నిర్ణయం విరమిచాలనిడిమాండ్ చేస్తూ బుధవారం నాడు పట్టణ ఆరోగ్య కేంద్రం  వైద్య సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ( సీఐటీయూ) జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్   సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ రోజురోజుకు రాష్ట్రంలో కరోనా టెస్టులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఏఎన్ఎంలు పారామెడికల్ సిబ్బంది అప్పగించాడు సరికాదన్నారు. ఇప్పటికే ఏఎన్ఎం ల మీద చాలా భారం ఉందన్నారు. టెస్ట్ నిర్వహణతో పని భారం ఎక్కువ కావడమే కాకుండా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు.  మత శిశువు సంక్షేమం,గర్భిణి ల పరీక్షలు, HB శాతం,బీపీ,షుగర్ చూడండం,TT లు వేయడం,సుఖ ప్రసవం కోసం జాగ్రత్తలు చెప్పడం,డెలివరీ సమయంలో ఇబ్బందులు ఉంటే హాస్పిటల్స్ కు రెపరల్ చేయడం,పుట్టిన బిడ్డకు వ్యాది నిరోధక టీకాలు ఇవ్వడం, కేసీఆర్ కిట్ ఇప్పించడం,TB బాధితులకు, కుష్ఠు వ్యాధి గ్రస్థులకు మందులు పంపిణీ చేయడం,సబ్ సెంటర్ స్తాయిలో సమావేశం ఏర్పాటు చేయడం, జాతీయ స్థాయి ,రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం లో విటమిన్లు, పుష్టికా హారం, జనాభా నియంత్రణ, లాంటి కార్యక్రమంలో పాల్గొనడం,గ్రామంలో జరిగే జనన,మరణాలను నమోదు లాంటి పనులతో ఏఎన్ఎం ఇబ్బందులు పడుతున్నారని తెలిపినారు.ఈ కార్యక్రమంలో లక్ష్మి లక్ష్మి ఏర్పడిన లలిత అన్నపూర్ణ హరిత జ్యోతి మౌనిక పుష్ప రమాదేవి పుష్పలత తులసి తదితరులు పాల్గొన్నారు.