- సూర్యాపేట డీఎంహెచ్‌ఓ హర్షవర్ధ్దన్
సూర్యాపేట(ఆరోగ్యజ్యోతి): జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రైవేట్ దవాఖానల్లో ఎలాంటి కరోనా పరీక్షలు చేయకూడదనినిబంధనలు ఉల్లంఘిస్తే ల్యాబ్ లేదా దవాఖానను సీజ్ చేస్తామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రైవేట్ దవాఖానలో అందిస్తున్న సేవల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని శ్రీ సత్య డయాగ్నస్టిక్ సెంటర్, సూర్యాపేట దవాఖాన, శ్రీని స్కాన్ సెంటర్‌లతో పాటు ఎస్ ఎస్ ఫార్మాసీ డిస్ట్రిబ్యూటర్లల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి మాట్లాడారు. రక్త పరీక్షలు చేసే ప్రతి డయాగ్నస్టిక్ సెంటర్ డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో అనుమతి తీసుకోవాలన్నారు. అలాగే లింగ నిర్ధారణ పరీక్షలు చేయరాదని సమాచారం ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. ఆయన వెంట ఇన్స్‌పెక్టర్ కార్తీక్ భరద్వాజ్, డెమో తిరుపతిరెడ్డి, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్, ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్ రాజు పాల్గొన్నారు.