ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలభిసేకం

ఆదిలాబాద్, (ఆరోగ్యజ్యోతి); జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ రిమ్స్  ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఎ ఎం రిజ్వ  బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రిమ్స్ ఆసుపత్రికి 20 కోట్లు మంజూరు చేయించినందుకు ఎమ్మెల్యే జోగు రామన్న, కేటీఆర్ ,  కేసీఆర్ పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే జోగు రామన్న నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు బండారి సతీష్ ప్రకాష్ చందన నర్సింగ్ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు రామ్ కుమార్ , మోబిన్ ,తెలంగాణ జాగృతి అధ్యక్షులు శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు