వరంగల్,(ఆరోగ్యజ్యోతి): ఖిల్లావరంగల్ మీజియం భవనంలో కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్న భవనం వద్ద బురదమయం కావడంతో 9వ వార్డు డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి శ్రీలత గుంతలను పూర్తి మరమ్మత్తులు చేయించారు. ఖిల్లా వరంగల్ మధ్యకోటలో నూతనంగా నిర్మిస్తున్న మీజియం భవనంలో కొత్తగా కోవిడ్-19 పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల లోనికి వెళ్లకుండా రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో రోగులకు ప్రజలకు వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించి ఇచ్చారు .ఈ పనులను వైద్యాధికారి డాక్టర్ రవీందర్, సిబ్బంది రాజేష్ కన్నా తదితరులు పరిశీలించారు.