హైదరాబాద్‌లో తగ్గుముఖం: ఈటల

హైదరాబాద్‌(ఆరోగ్యజ్యోతి):  కరోనాకు అసలైన మందు ధైర్యం అని మంత్రి ఈటెల రాజేంద్ర అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. హైదరాబాద్‌లో మాత్రం కొత్త కేసుల నమోదు తగ్గిందన్నారు. ఇప్పటి వరకు కరోనా సోకిన వారిలో 99 శాతం బాధితులు కోలుకున్నారని.. చికిత్సలో సరైన ప్రొటోకాల్ పాటిస్తే.. మరణాలు సంభవించే అవకాశం లేదన్నారు. కరోనా రోగుల పట్ల వివక్ష తగదన్నారు.