ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపాలిటీల్లో మంగళవారం డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా నివారణకు మెగా ప్రచారాన్ని నేతలు ప్రారంభించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నివాస ప్రాంతం ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో దోమల నివారణ ఫాగింగ్ ప్రచారాన్ని ఉత్తర ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమాజీ మంత్రి విజయ్ గోయెల్, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షుడు శ్యామ్ జాజుల పాల్గొన్నారు.