- అదనపు వైద్యాధికారి డాక్టర్ కుడ్మెత మనోహర్
ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి): క్షయ నిర్మూలనకు కృషి చేద్దామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా (ఉట్నూర్) అదనపు వైద్యాధికారి కుడ్మెత మనోహర్ వైద్య సిబ్బందికి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని క్షయ నివారణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించారు. గిరిజన ప్రాంతాల్లో క్షయ వ్యా ధిగ్రస్తులు వివరాలు, చికిత్స గురించి వైద్యాధికారి సాయిప్రియను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను ప రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షయ వ్యాధిగ్రస్తులకు ఉచిత మందులు అం దజేస్తూ, పోషకాహారం కోసం నెల కు రూ.500 ఇస్తున్నదన్నారు. రవాణా చార్జీలు కూడా అందజేస్తున్నట్లు చెప్పా రు. సాధారణ పరీక్షల కోసం వచ్చిన వారికి క్షయ లక్షణాలు ఉంటే పూర్తి స్థాయి లో పరీక్షలు నిర్వహించాలని సూచించారు జిల్లా కోఆర్డినేటర్ మల్లయ్య, ల్యాబ్ టెక్నీషియన్ కృష్ణ, సిబ్బంది రమేశ్, నాగభూషణం, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.