జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్
ఆదిలాబాద్ (ఆరోగ్యజ్యోతి): ఆసుపత్రులకు వచ్చే రోగుల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ అన్నారు మంగళవారం నాడు పుట్లిలిబౌలి పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులకు అన్ని రకాల సేవలందించాలని సూచించారు. క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని ఆయన తెలిపారు కరోన సర్వేలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, అనుమానం ఉన్నట్లయితే వెంటనే వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. జిల్లా వైద్య అధికారి వెంట అడిషనల్ డియంఅండ్ఎహ్ఓ డాక్టర్ సాధన తదితరులు ఉన్నారు.