హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ (TPHDA),తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (TGGDA) , TMPH JAC తరపు ,తెలంగాణ రాష్ట్రం, DGP మహేందర్ రెడ్డిని కలవటం జరిగింది.హుజురాబాద్ ఏరియా హాస్పిటల్ డాక్టర్ ఆర్. ప్రవీణ్ రెడ్డి (సూపరింటెండెంట్)ను గుర్తు తెలియని వ్యక్తులు ఆగస్ట్ 27 న దాడి చేశారని దుండగులను గుర్తించి శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు,TMPH JAC చైర్మన్ డాక్టర్ రవి శంకర్, TGGDA సెక్రటరీ షరీఫ్, తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్,TMPH JAC వర్కింగ్ కమిటీ చైర్మన్ Dr. కత్తి జనార్దన్, స్టేట్ సెక్రటరీ డాక్టర్ ప్రవీణ్ స్టేట్ సెక్రటరీ, డాక్టర్ అభిరామ్ లు డీజీపీ దృష్టికి తిసుకేల్లినారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ COVID-19 మహమ్మారి మధ్య వైద్యులు ,ఆరోగ్య సిబ్బందిపై దాడులు చేయడం సరికాదన్నారు. రోగులకోసం వైద్యులు , మెడికల్ పారామెడికల్ సిబ్బంది కుటుంబలను వదిలి నెలల తరబడి వైద్యం అందిచారన్నారు. ఈ సంఘటనకు సంబంధిత వ్యక్తులు దోషులుగా తేలితే వారిని చట్టప్రకారం శిక్షించాలని మేము డిజిపి కోరడం జరిగిందన్నారు . డిజిపి సమస్యకు సంబంధించి విచారణ ప్రారంభిస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపినారు.