సంగారెడ్డి(ఆరోగ్యజ్యోతి) : హత్నూర ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్, డేటా ఆపరేటర్ , పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి కార్యాలయం వద్ద సిబ్బంది శుక్రవారం నాడు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారిని డాక్టర్ నాగ జ్యోతి ,హెల్త్ అసిస్టెంట్లు నేహ , నిర్మల, డేటా ఏంటి ఆపరేటర్ పురుషోత్తం, ఆశ వర్కర్లు నర్సమ్మ, సునీత, లత, గోదావరి, రేఖ, లక్ష్మి, యాదమ్మ తదితరులు పాల్గొన్నారు.