- జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అదికారి డాక్టర్ నరేందర్ రాథోడ్
ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి) : కొవిడ్ లక్షణాలున్నవారు స్వచ్ఛందంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అదికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. పట్ణణంలోని మున్సిపల్ కా ర్యాలయంలో పుత్లీబౌలి యూపీహెచ్‌సీ ఆధ్వర్యంలో శుక్రవా రం కొవిడ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిప ల్ సిబ్బందికి కరోనా పరీక్షలు చేశారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ హోం ఐసొలేషన్‌లో ఉండాలన్నారు. పూర్తీ జాగ్రతలు పాటించాలని అయన సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కులు తప్పకునాడ దరిన్చాలన్నారు.పట్టణంలో నిరవహిస్తున్న కోవిడ్ పరీక్షా శిభిరంలో కరోన లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి పరీక్షలు చేసుకోవచ్చన్నారు. 89 మందికి పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సాధన, స్టాఫ్ నర్సు సుజాత, ల్యాబ్ టెక్నీషియన్ సంగీత, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్ శృతి తదితరులు పాల్గొన్నారు.