కరోన పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుంది

- ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుస్ వైద్య అధికారి డాక్టర్ కృష్ణవేణి


ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):  కరోన పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుస్ వైద్య అధికారి డాక్టర్ కృష్ణవేణి అన్నారు.అదివారం నాడు తాంసీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల నిపానిలో  ఉచిత కోవిడ్ టెస్ట్ శిబిరాన్ని ఏర్పాటు చేసినారు. ఈ సందర్భంగా  ఆమె  మాట్లాడుతూ జిల్లా ఎయిడ్స్ మరియు లెప్రసీ అధికారి  డాక్టర్ శ్రీకాంత్  ఆదేశాల మేరకు కరోన పరీక్షల శిభిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కరోన లక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం మాస్కులు ధరించడం వల్ల కరోన రాకుండా ఉంటుందని అయన  తెలిపారు. కరోన  వ్యాధి వచ్చిన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. వైద్యులు సూచించిన సూచనలను పటించాలని ఆమె తెలిపినారు.అలాగే ఉన్నట్లు నిర్ధారణ అయితే 14 నుంచి 17 రోజులపాటు హోం ఐసొల్యూషన్ లో ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్మసిస్ట్  మహేందర్, హెల్త్ అసిస్టెంట్లు  రమణ, ల్యాబ్ టెక్నిషియాన్ సంతోష్ , ఏఎన్ఎంలు పుష్పలత, కళవతి, సుజాత, ఆశా కార్యకర్తలు  నజీమ, సంగామిత్ర తదితరులు పాల్గొన్నారు.