- తెలంగాణా మెడికల్&హెల్త్ ఎంప్లాయ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి(మహిళ విభాగం) బోడ అరుణ
వరంగల్ రూరల్ ,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ ఫిల్డ్ స్టాఫ్ ఎఎన్ఎం లు కరోనా పరీక్షలు చేయాలని ఆదేశించడం సరైన విధానం కాదని కోవిడ్ పరీక్ష లు చేయించాలనే నిర్ణయం విరమిచాలని తెలంగాణా మెడికల్&హెల్త్ ఎంప్లాయ్ యూనియన్ , ప్రధాన కార్యదర్శి(మహిళ విభాగం), బోడ అరుణ డిమాండ్ చేసినారు. చెన్నారావు పేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఎఎన్ఎం లు గౌరవ తహసిల్దార్ గారికి కరోనా నిర్దారణ పరీక్ష ల నుండి మినహాయింపు చేయాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే ఎఎన్ఎం లకు పనిభారం ఎక్కువగా ఉందిని, వైద్య ఆరోగ్య శాఖ లో అన్ని పనులు ఎఎన్ఎం లు చేయడంతో పనిభారం పెరుగుతుందన్నారు. ఎఎన్ఎం ల తో కరోనా టెస్టులు చేయించడం సమాజానికి అత్యంత ప్రమాదకరమని అన్నరు. ఈ పని చేయడానికి టెక్నికల్ గా ట్రైండ్ అయిన LT లను నియమించి వారి ద్వారా నే కరోనా పరీక్షలు చేయించాలని ఆమె డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో మౌనిక, ఫ్రాన్సిక,లత, అరుణమ్మ, కవిత, శ్వేత ,రాజకుమారి, పుష్పలత, శకుంతల, మంజుల తదితరులు పాల్గొన్నారు.