చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

వరంగల్(ఆరోగ్యజ్యోతి): చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 9 వ డివిజన్ లో పుప్పలగుట్ట డీ.ఎస్.అర్.గార్డెన్ లైన్ లో శుక్రవారం మెడికల్ క్యాంపు డాక్టర్.ఎస్.రవీందర్ నిర్వహించారు. ఈ కార్యక్రమము లో డాక్టర్ రవీందర్ గారు మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు  దోమ తెరలు వాడాలని ,పరిసర ప్రాంతాలలో నీరు నిల్వకుండా చూడాలని, చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని, ఆలాగే కరోనా వ్యాధీ సోకకుండా ప్రతి ఒకరు విధిగా మాస్క్ ధరియిచాలని ప్రతి అరగంటకు ఒక సారి సబ్బు తో చేతులు శుభ్ర పరుచుకోవాలని తెలిపారు .ఈ కార్యక్రమంలో లో మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ .సి.ఓ. డీ.మోహన్ రావు , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , పెనిన్నా ఏ.ఎన్.ఎం ఆశ వర్కర్స్ రజిత , అనూష ,సుమలత పాలుగోనారు.