ఉద్యోగికీ పదవీ విరమణ సహజం

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి) ప్రతినిధి: రిమ్స్ లో పని చేసిన ప్లంబర్ మహేందర్, ల్యాబ్ అటెండెట్ అంజూమ్  లు సోమవారం పదవీ విరమణ చేసినారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి పదవీ విరమణ చేయటం సహజం అని  వారు అన్నారు  ప్లంబర్ మహేందర్, ల్యాబ్ అటెండెట్ అంజూమ్  లు పదవీ విరమణ సందర్భంగా వారిని ఘనంగా శాలువ ,పులా దండలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రిమ్స్ జె ఏ సి నాయకులు సలామ్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సాధారణమే  అని అ న్నారు.వారి పదవీ లో మంచి సేవలు అందించారని ఈ సందర్భంగా అయన గుర్తు చేశారు, వారి శేషాజీవితం కుతుమ్భంతూ ఆయురారోగ్యాలతో  గడపాలన్నారు మహేందర్, అంజూమ్ లు మాట్లాడుతూ గత 36 సంవత్సరలుగా ఎలాంటి రిమార్కులు,ఫిర్యాదులు, లేకుండా ఉద్యోగం  చేశామని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ పిఆర్ఓ జి.శారద, ఉద్యోగులు గంగారెడ్డి, సురేఖ, సంతోషిణి, మునిర్, విలాస్, సురేందర్, శ్రీనివాస్, రామకృష్ణ, షాఫిద్దీన్, చందు తదితరులు పాల్గొన్నారు,