వడ్డేపల్లి లో వైద్య శిబిరం

 


వరంగల్ (ఆరోగ్యజ్యోతి):వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రంలో గల ఎస్సీ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్నిమంగళవారం  నిర్వహించారు. రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. బిపి షుగర్ ఇలాంటి పరిక్షలు రోగులకు  చేయడంతోపాటుకరోన  వ్యాధి పై అవగాహన కూడా కల్పించారు. ఈ శిబిరంలో 48 మంది కి రోగులకు వైద్య సేవలు అందించారు .ఈ సందర్భంగా వడ్డేపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ తేజస్విని మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వస్తున్నాయని ఇంటి వద్ద పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నట్లయితే వ్యాధులు దరిచేరవు అన్నారు. కొన్ని రకాల వ్యాధులు కరోనాకు లక్షణాలతో సమానంగా ఉన్నాయని ప్రజలు భయపడవద్దు అన్నారు. ఆ లక్షణాలు కనిపించిన వెంటనే కరోన  వచ్చిందని భయాందోళనకు గురి కావద్దని, కరోన లక్షణాలు ఇలాంటి వ్యాధుల్లో కూడా కనిపిస్తాయి అని తెలిపారు. కరోన కు సంబంధించిన లక్షణాలు కనిపించిన వెంటనే కరోనకు సంబంధించిన పరీక్షలు చేయడం జరుగుతుందన్నారు. పూర్తి జాగ్రత్తలు పాటించినట్లయితే కరోన వ్యాధి దరిచేరదని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో టి.మానస, రూప లతా, నిరంజన్, జ్యోతి, ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.