- వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్
- 200 కోట్లతో వైద్య ఉద్యోగుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి : TMPH JAC
200 కోట్లతో వైద్య ఉద్యోగుల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలి : TMPH JAC
వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వైద్యులు మరియు వైద్య సిబ్బంది విధి నిర్వహణలో ఏదైనా జరిగితే ప్రాణాలు కోల్పోతే తక్షణమే ఆదుకోవడం కోసం ప్రభుత్వం 200 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కోరడం జరిగిందని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం, తెలంగాణ పబ్లిక్ హెల్త్ వైద్యుల సంఘం మరియు తెలంగాణ మెడికల్ & పబ్లిక్ హెల్త్ JAC అధ్వర్యంలోవైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కి వినతి పత్రాన్ని సమర్పిచారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం మరియు చైర్మన్ తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ జెఎసి డాక్టర్ రవి శంకర్. తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ షరీఫ్ ,తెలంగాణ ప్రజారోగ్య వైద్యుల సంఘం వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ జనార్ధన్, టి పి హెచ్ డి ఏ. టి ఎన్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అభిరామ్, టిడిపి హెచ్ డి ఎ కో కన్వీనర్ టి ఎన్ పి డాక్టర్ ప్రవీణ్ లు అన్నారు. ప్రస్తుత సమాజంలో రకరకాల జబ్బులు వస్తున్నాయని వాటిని నయం చేయడంలో వైద్యులు వైద్య ఆరోగ్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తుందని విధినిర్వహణలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఇటీవల వచ్చిన కరోనా వల్ల చాలామంది వైద్య ఆరోగ్య సిబ్బంది చనిపోయారని వారి కుటుంబాన్ని ఆదుకోలేక పోయామని అందుకే ప్రభుత్వం కార్పస్ పండును ఏర్పాటు చేసి మెడికల్ పారామెడికల్ సిబ్బందిని ఆదుకోవాలని ఆయన కోరారు. కరోన వల్ల వైద్య ఉద్యోగులందరూ ఎంతగానో కష్టపడుతున్నారని ఈ సందర్భంగావారు తెలిపారు