ఆసిఫాబాద్ (ఆరోగ్యజ్యోతి) : కరోనా బాధితులతో వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతగా మెలగాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వైద్యాధికారి కుమ్రం బాలు సూచించారు. వాంకిడి ఐసొలేషన్ కేం ద్రాన్నిఅయన శుక్రవారంనాడు సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. కేంద్రంలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యాన్ని పరిశీలించారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వైద్యాధికారులకు తగు సూచనలు చేశారు.