రేపు టీఎంపిహెచ్ఈ (జెఏసి) ఎన్నికలు

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ మెడికల్ మరియు పబ్లిక్ హెల్త్ ఉద్యోగుల ల జాయింట్ యాక్షన్ కమిటీ ఎన్నికలు ఆదివారం నాడు ఉదయం 11 గంటలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షులు  బండారి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన వివిధఉద్యోగ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంఘ సభ్యులు ఉద్యోగులు, రెగ్యులర్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎంహెచ్ఎం ఉద్యోగులందరూ హాజరు కావాలన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జెఎసి వర్కింగ్ కమిటీ చైర్మన్ జనార్ధన్, జెఎసి కమిటీ జనరల్ సెక్రటరీ సుదర్శన్ లు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని అయన తెలిపినారు . ఈ ఎన్నికలకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి తప్పకుండా మాస్క్  ధరించాలని, ఎన్నికల సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని జిల్లా అధ్యక్షులు  బండారి కృష్ణ కోరారు.