- జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ శ్రీధర్
గాదిగూడ,ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి) : సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా మలేరియా నివారణాధికారి డాక్టర్ ఎన్ శ్రీధర్ అన్నారు. బుధవారం నాడు గాదిగూడ , ఝారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను. పరిశీలించారు .దోమల నివారణ కొరకు ఏమి చర్యలు తీసుకున్నారని ,మలేరియా పరీక్షలు ఎన్ని చేసినారని సిబ్బందిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోజురోజుకు వర్షాలు పడటం వలన దోమలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు .మలేరియా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ సూరత్,సూపర్వైజర్ లు సంజయ్, రవీందర్ తదితరులు ఉన్నారు