కోవిడ్ వార్డును శుభ్రంగా ఉంచండి

ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి) : జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలోని కోవిడ్ (కరోన)వార్డులో శుభ్రత కరువైందని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ తెలిపినారు.వార్డ్ లో ఉన్న  పేషెంట్ లు తనకి  సమాచారం ఇవ్వడంతో వెంటనే రిమ్స్ లోని కోవిడ్ వార్డుకు చేరుకొని అక్కడి సిబ్బంది తో మరుగుదొడ్లు, పరిసరాలు శుభ్రంగా శుబ్రం చేసినారన్నారు.కోవిడ్ పేషెంట్ ల కోసం ఏర్పాటు చేసిన ఆక్సీజన్ కొరత ఉండడంతో రిమ్స్ డైరెక్టర్ కి ఫోన్ ద్వారా చెప్పి ఆక్సీజన్ సిలెండర్ లను తెప్పించామన్నారు . కోవిడ్ వార్డ్ లోని ఓ  పేషెంట్ అక్కడ శుభ్రత లేదని ఉండలేకపోతున్నాని సాజిద్ ఖాన్ గారి కి చెప్పడంతో ఆ కోవిడ్ పేషెంట్ ను రిమ్స్ అధికారుల అనుమతి తో హోమ్ క్వారంటైన్ కు తరలించడం జరిగిందన్నారు . కోవిడ్ సోకిన పేషెంట్ల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బంది ని కోరారు. రోజు రోజుకు కరోనా వ్యాప్తి విజృంభిస్తున్న తరుణం లో ప్రభంత్వం వైరస్ ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలలో ఎందుకు విఫలమవుతున్నారు. ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ పేషెంట్ ల పట్ల నిర్లక్ష్య వైఖరి ని మానుకోవాలన్నారు.