లక్షణాలు ఉంటే కరోన పరిక్షలు చేయించుకోండి


  • జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేంద్ర


ఆదిలాబాద్(ఆరోగ్యజ్యోతి):  లక్షణాలు ఉంటే కరోన పరిక్షలు చేయించుకోండని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ అన్నారు . శనివారం నాడు అంకోలి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల కె.ఆర్.కె కాలనీలో ఉచిత కోవిడ్ టెస్ట్ శిబిరాన్ని ఏర్పాటు చేసినారు.ఈ సందర్భంగా  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాథోడ్ నరేందర్ మాట్లాడుతూ కరోన పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని లక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం మాస్కులు ధరించడం వల్ల కరోన రాకుండా ఉంటుందని అయన  తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలుతీసుకున్నట్లయితే కరోనా వ్యాధి దరిచేరదని  ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోన  వ్యాధి వచ్చిన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. పోషకాలతోకూడిన  ఆహారాన్ని భుజించాలి తెలిపినారు. వైద్యులు సూచించిన మేరకు మెడికల్ కిట్ లో ఉన్న మందులను సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఏదైనా తీవ్రమైన లక్షణాలు ఉన్నచో రిమ్స్ ఆస్పత్రికి వెళ్లాలని తెలిపారు. అనంతరం కాలనీలో ఉన్న వృద్ధాశ్రమాన్ని పండ్ల పంపిణీ చేశారు.వార్డు కౌన్సిలర్ ఆనంద్ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు .ఈ శిబిరంలో అంకోలి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రోజా  రాణి సిబ్బంది ఆధ్వర్యంలో 50 మంది కి కరోన  వైద్య పరీక్షలను నిర్వహించారు .ఈ కార్యక్రమంలోహెల్త్ సూపర్వైజర్ సురేష్, హెల్త్ అసిస్టెంట్లు ఈశ్వర్ రెడ్డి, ప్రేమ్ సింగ్, నారాయణ, ఆరోగ్య కార్యకర్తలు శకుంతల, ముయ్యాల మోతీ, వేణు తాయి, ల్యాబ్ టెక్నీషియన్లు శ్రీనివాస్, నవీన్, తో పాటు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు