సామజిక దూరం పాటించండి

ఆదిలాబాద్ ఇచ్చోడ(ఆరోగ్యజ్యోతి):  లక్షణాలు ఉంటే కరోన పరిక్షలు చేయించుకోని సామాజిక దురాన్ని పాటించాలని ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి డాక్టర్  సాగర్ అన్నారు. సోమవారం నాడు ఇచ్చోడ   ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల డి ఎన్ తండ  గ్రామంలో ఉచిత కోవిడ్ టెస్ట్ శిబిరాన్ని ఏర్పాటు చేసినారు.ఈ సందర్భంగా  అయన  మాట్లాడుతూ కరోన పరీక్షలను ప్రభుత్వం ఉచితంగా చేస్తుందని లక్షణాలు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సామాజిక దూరం మాస్కులు ధరించడం వల్ల కరోన రాకుండా ఉంటుందని అయన  తెలిపారు. ముందు జాగ్రత్త చర్యలుతీసుకున్నట్లయితే కరోనా వ్యాధి దరిచేరదని  ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కరోన  వ్యాధి వచ్చిన వారు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు. గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షలు చేయడం తో పాటు ఐరన్ టాబ్లెట్లు అందించారు.గర్భవతి అయిన వెంటనే కెసిఆర్ కిట్ కొరకు పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు .పేరు నమోదు చేసుకున్నట్లయితే మూడువేల రూపాయలు మొదటి విడత రావడంతో పాటు మొత్తం 12 వేల రూపాయల వరకు సహాయం అందుతుందన్నారు.దీనితో పాటు కేసీఆర్ కిట్  ప్రసూతి అయిన తర్వాత ఉచితంగా ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు..ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉత్తం, కైలాష్, అహల్య ,రాజ్ కిరణ్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.