- రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ కత్తి జనార్ధన్
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి(జేఏసీ) అన్ని వేళల కృషి చేస్తుందని రాష్ట్ర వర్కింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బి జనార్ధన్ అన్నారు. ఆదివారం నాడు ఆదిలాబాద్ పట్టణంలోని వైద్య ఆరోగ్య శాఖ అధికారి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా వైద్యఆరోగ్యశాఖ లోని అన్ని స్థాయిల ఉద్యోగులు కరోనా మహమ్మారి నియంత్రణలో సైనికుల పోరాటం చేస్తున్నారని, ఇది అభినందనీయమైన విషయం అన్నారు. ఈ సమయంలో మృత్యువాత పడిన వైద్యులకు పారామెడికల్ సిబ్బంది రెండు నిమిషాలు మౌనం పాటించారు. కరోనా బారిన పడిన సమయంలో ప్రత్యేక వైద్యం అందించైనా ఉద్యోగుల గుర్తించాలని ఆయన డిమాండ్. చేశారు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వాలని, ఖాళీలను భర్తీ చేయాలని, పెండింగ్లో ఉన్న పదోన్నతులు వెంటనే కల్పించడంతో పాటు వైద్య ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు అనంతరం ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నరేంద్ర మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు.ఇప్పటికే చాలా వరకు సమస్యలను పరిష్కరించడం జరిగిందని మునుముందు కూడా ఉద్యోగులకు సమస్యలు ఉన్నట్లయితే ఎల్లవేళలా సహకరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర కోచైర్మన్ ఇన్ సుదర్శన్ కో కన్వీనర్ డాక్టర్ అభిరామ్ డాక్టర్ ప్రవీణ్ తో పాటు జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్యాధికారులు మెడికల్ పారామెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
జే.ఏ.సి జిల్లా కమిటీ చైర్మన్ గా డాక్టర్ శ్రీధర్
తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) జిల్లా కమిటీ ని ఆదివారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సమావేశ మందిరంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా చైర్మన్ గా డాక్టర్ ఎం. శ్రీధర్, కన్వీనర్ గా బండారి కృష్ణ ,కోశాధికారిగా డాక్టర్ క్రాంతి, వైస్ చైర్మన్ లుగా డాక్టర్ శ్రీకాంత్, రామకృష్ణ , సిడం వామన్ రావ్ లు ఎన్నికయ్యారు .వర్కింగ్ కమిటీ చైర్మన్ గా ధనుంజయ్ నీ ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తూ తమ వంతుగా కృషి చేస్తామని తెలిపారు.