- నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):ఇటీవల నిర్మల్ జిల్లా లో కోవిడ్ రిక్రూట్మెంట్ కొరకు నోటిఫికేషన్ విడుదల చేశారని, అందులో స్టాఫ్ నర్స్ 15 వేల రూపాయల వేతనం ఇవ్వడం జరుగుతుందని తెలిపారని 15 వేలకు బదులుగా 25 వేల రూపాయల వేతనం చెల్లించాలని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దావత్ డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్యవిధాన పరిషత్, టీచింగ్ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్ లకు 25 వేల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందని అదేరీతిలో కూడా నిర్మల్లో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు . ట్రైన్డ్ నర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీస్ ఢిల్లీ నుండి నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ రాయ్ కూడా స్టాఫ్ నర్స్ లకు25 వేల రూపాయల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని కోరారు. అన్ని ఆస్పత్రుల్లో నర్సింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని భర్తీ చేసినట్టయితే కోవిడ్ నువ్వు కూడా అరికట్టిన వారం అవుతామని ఆయన కోరారు