ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ రిమ్స్ ఆసుపత్రికి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎస్ఎ ఎం రిజ్వ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.ప్రభుత్వం వాటా 30 కోట్లు కేంద్ర ప్రభుత్వం వాటా 120 కోట్లు కలిపి మొత్తం 150 కోట్లు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. ఇందులో 80 కోట్లు భవన నిర్మాణానికి కాగా 70 కోట్లు వైద్య పరికరాల కొనుగోలుకు నిధులు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకు ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే 220 పడకలు అన్డుభాతులోకి వసతి. 8 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే అవకాశాలు ఉన్నాయి న్యూరో. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తి అయినట్లు అధికారులు పేర్కొన్నారు, మిగతా 20 శాతం పనులు పూర్తీ కావలసి ఉంది.ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రి కేటీఆర్ ను కలిసి వివరించగా వెంటనే ఆయన స్పందించి 20 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయడం జరిగింది. సీఎం చంద్రశేఖర రావు , కేటీఆర్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే జోగు రామన్న మంత్రి కేటీఆర్ ను కలిసివినతి పత్రం ఇస్తున్న దృశం (పైల్) ఫొటో