12 లక్షల టెస్టులు పూర్తి


  • గురువారం 2,932 మందికి పాజిటివ్‌: 1580 డిశ్చార్జి

  • 11 మంది మృతి: నిత్యం 60 వేల పరీక్షలు 


హైదరాబాద్‌, (ఆరోగ్యజ్యోతి) :  రాష్ట్రంలో కరోనా  పరీక్షల సంఖ్య 12 లక్షలు దాటింది. గురువారం ఒక్కరోజే 61,863 వేల టెస్టులుచేయగా, 2,932 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. జీహెచ్‌ఎంసీలోనే 520 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాలో 218 చొప్పున, కరీంనగర్‌లో 168, నల్లగొండలో 159, ఖమ్మంలో 141, నిజామాబాద్‌లో 129, జగిత్యాలలో 113, మంచిర్యాలలో 110, సిద్దిపేటలో 100, సూర్యాపేటలో 102, భద్రాద్రి కొత్తగూడెంలో 89, వరంగల్‌అర్బన్‌లో 80, మహబూబాబాద్‌లో 76, మహబూబ్‌నగర్‌లో 67, రాజన్నసిరిసిల్లలో 64, పెద్దపల్లిలో 60, వనపర్తి, కామారెడ్డిలో 51 చొప్పున, సంగారెడ్డిలో 49, జోగుళాంబగద్వాలలో 46, యాదాద్రిభువనగిరి, నాగర్‌కర్నూల్‌లో 42 చొప్పున, జనగామలో 38, వరంగల్‌రూరల్‌లో 34, నిర్మల్‌లో 32, ఆదిలాబాద్‌లో 25, మెదక్‌లో 24, వికారాబాద్‌లో 22, ములుగులో 18, నారాయణపేటలో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 15, జయశంకర్‌ భూపాలపల్లిలో 13 కేసులు వెలుగుచూశాయి. 11 మంది మరణించారు.ప్రభుత్వం 4 రోజుల్లో 2 లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించింది. నిత్యం 60 వేలకు పైగా పరీక్షలు నిర్వహిస్తున్నది. నిమ్స్‌లో కోబాస్‌ యం త్రం త్వరలో అందు బాటులోకి రానున్నది.