వెంటనే బదిలీ చేయాలి – లేదంటే ఆందోళన చేపడుతం
ఆదిలాబాద్, ఇంద్రవెల్లి(ఆరోగ్యజ్యోతి); ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ అధికారి)గా విధులు నిర్వహిస్తున్నబాబులాల్ పై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదివాసి సంఘం నాయకులు, గిరిజన ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు శ్రీ రామ్ భీమ్రావు ,జిల్లా అధ్యక్షులు కార్యదర్శి నాగ రావు, ఎంపీపీ బాబాయ్ డిమాండ్ చేశారు. గురువారం ఇంద్రవెల్లి లోని వనవాసి కళ్యాణ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సిహెచ్ఓ (కమ్యూనిటీ హెల్త్ అధికారి)గా ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని, ఒకే చోటఉంటూ ఇంత వరకు బదిలీపై ఎక్కడికి వెళ్లలేదని వారు ఆరోపించారు. బాబూలాల్ విధులు సక్రమంగా నిర్వహించకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చిన వైద్య అధికారుల పై పెత్తనం చేస్తున్నారని ఈ సందర్భంగా వారు ఆరోపించారు. గత కొన్నేళ్లుగా బదిలీ అయిన ఇక్కడినుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళకుండా ఒకే చోట ఉంటూ తోటి సిబ్బందికి ఇబ్బందులు కలిగిస్తున్నరని వారు ఆరోపించారు. గతంలో ఆయనకు పలుమార్లు బదిలీ ఐన వెళ్లలేదని , దీనికి పై అధికారులు అస్తంకుడా ఉందన్నారు. గతంలో పనిచేసిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు బదిలీ చేసినప్పటికీ రిలీవ్ ఎందుకు చేయలేదని ఈ సందర్భంగా వారు ప్రశ్నించారు. ప్రస్తుతంకుడా ఆయనను ఇక్కడినుంచి పంపకూడ ఒక అధికారి కాపాడుతున్నారని విశ్వసనీయ సమాచారం అన్నరు. బాబూలాల్ పై ఎన్నో ఆరోపణలు వచ్చినప్పటికీ అధికారులు ఎందుకు నిమ్మకు నీరు ఎత్తిన విధంగా ఉన్నారన్న విషయం తనకు అర్థం కావడం లేదని ఈ సందర్భంగా వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఒకే ఉద్యోగి 15 సంవత్సరాలుగా ఒకే ప్రాంతంలో పని చేయడం అన్న విషయం ఆషామాషీ కాదని వారు పేర్కొన్నారు వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదివాసీ జిల్లా నాయకులు సాయినాథ్, ఆదివాసి పురోహిత్ ప్రధాన సమాజ్ మండల అధ్యక్షులుసోయం రామదాస్,కోలం ఆదివాసి సంఘం మండల అధ్యక్షులు, ఎంపిటిసిమడవి బీమ్రావు , ఎంపిటిసి మధుకర్,ఎంపి పి గోపాల్ సింగ్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరూప రాజు, జిల్లా ఉపాధ్యక్షుడు దీపక్ సింగ్ షెకావత్, పార్టీ మండల అధ్యక్షులు అరెల్లి రాజలింగు,నాయకులు భరత్, రాజేందర్,చందర్ సింగ్, ప్రకాష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.