మిర్యాలగూడ (ఆరోగ్యజ్యోతి) : పట్టణంలో గురువారం నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌ఓ కేసా రవి తెలిపారు. సీతారాంపురంకాలనీలో ఇద్దరికి, నందిపహాడ్, ఎన్నెస్పీ క్యాంపుల్లో ఒక్కొక్కరికి మొత్తం నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్లు చెప్పారు. సుందర్‌నగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు అనారోగ్యానికి గురి కా వడంతో బంధువులు హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. అతడికి కరోనా లక్షణాలు ఉండడంతో మృతదేహాన్ని ఏరియా దవాఖానలో భద్రపరిచారు.