జార్ఖండ్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. మాస్క్ ధరించడం ఇప్పుడు అనివార్యంగా మారింది. వైరస్ సంక్రమణను అడ్డుకోవాలంటే మాస్క్ ఓ కవచంలా పనిచేస్తుంది. అయితే జనం ఆ నియమాన్ని పాటించడం లేదు. దీంతో కొన్ని ప్రభుత్వాలు.. మాస్క్ ధరించనివారిపై భారీ జరిమానాలు వేస్తున్నాయి. జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్క్ ధరించనివారిపై కొరడా రుళుపించింది. అలాంటి వారిపై భారీ జరిమానాలు వసూల్ చేయనున్నట్లు చెప్పింది. లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా.. ఒకవేళ ఎవరైనా ముఖానికి మాస్క్ లేకుండా బయటకు వెళ్తే లక్ష రూపాయాలు జరిమానా వసూల్ చేయనున్నట్లు ఆ ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి అదనంగా రెండేళ్ల జైలుశిక్షను కూడా అమలు చేయనున్నారు. మరో వైపు భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 45,720 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.