పేషంట్ కేర్ సర్వీసెస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి
ప్రతి నెల ఐదో తారీఖు లోపు జీతాలు చెల్లించాలి
కోవిద్ 19 డ్యూటీ లో పాల్గొన్న సిబ్బందికి ప్రత్యేక ఇన్సెంటివ్ చెల్లించాలి
అధ్యక్షులు కర్నాటి సాయి రెడ్డి
హైదరాబాద్ :(ఉస్మానియా హాస్పిటల్): వివిధ ఆస్పత్రుల్లో పేషంట్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ లుగా పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మెడికల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఎంప్లాయిస్( హెచ్ 1) యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు కర్ణాటక సాయి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ ఉస్మానియా హాస్పిటల్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అనేక సంవత్సరాలుగా హాస్పిటల్లో పేషెంట్లకు కేర్ సర్వీస్ అందిస్తున్న ప్రొవైడర్ లను ప్రభుత్వం చిన్న చూపు చూడడం తగదన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు ప్రభుత్వం ఇచ్చే వేతనానికి ఏ మాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల గాంధీ ఆసుపత్రిలో పారామెడికల్ సిబ్బందికి, నర్సులకు ఇచ్చిన హామి నె హెల్త్ ప్రొవైడర్ల కు ఇవ్వాలని కోరారు. ప్రస్తుత కరోణ వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ప్రాణాన్ని లెక్క చేయకుండా సర్వీస్ సంధిస్తున్న కేర్ సిబ్బందికి కనీస వేతనం రూ" 35000 చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. నాలుగో తరగతి ఉద్యోగుల కు ఇస్తున్న ఇన్సెంటివ్ వీరికి వర్తించేలా చూడాలన్నారు.. వేతనాలు పెంచి క్రమబద్ధీకరణ చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి పీఎఫ్ ,ఈఎస్ఐ సౌకర్యాన్ని కల్పించాలన్నారు. థర్డ్ పార్టీ కాకుండా నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లలో జీతాలు జమ చేయాలని కోరారు. టెక్నికల్ నాన్ టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీతాలు చెల్లించాలన్నారు. కోవిద్ 19 డ్యూటీ లో విధులు నిర్వహిస్తున్న పారామెడికల్ సిబ్బంది, నర్సులకు రూ"750 చొప్పున, అలాగే నాలుగో తరగతి ఉద్యోగులకు రూ "300 చొప్పున ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్టు ,ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ హెల్త్ కార్డులు జారీ చేస్తూ ప్రతి నెల ఐదో తేదీ లోపు జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో ఔట్సోర్సింగ్ ,కాంట్రాక్ట్, నాలుగో తరగతి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే సీఎం కేసీఆర్ ,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా హాస్పిటల్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షులు శివకుమార్, కార్యదర్శి రాములు గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ చారి అశోక్ ,రవి ,హేమా పేషంట్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ ఎంప్లాయిస్ ప్రెసిడెంట్ కిరణ్, కార్యదర్శి జీవన్ ,గోపాల్ తదితరులు పాల్గొన్నారు .